దొర మాటలను నమ్మకండి.. మండిపడ్డ షర్మిల

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​ దొర మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల ప్రజలకు సూచించారు. 54 శాతం జనాభా కలిగిన బీసీలను నిలువునా ముంచుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లబొల్లి మాటలతో దోపీడీ చేస్తున్నాడని మండిపడ్డారు. బీసీ పాలసీను అమలు చేస్తామని 4 ఏళ్ల క్రితం మాటిచ్చినా.. ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. బీసీలంటే అంత చులకన ఎందుకని? ప్రశ్నించారు. బీసీలంటే టీఆర్ఎస్​ పార్టీ మీటింగ్​ లకు మందిని తెచ్చేవారు […]

Update: 2021-10-11 02:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​ దొర మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల ప్రజలకు సూచించారు. 54 శాతం జనాభా కలిగిన బీసీలను నిలువునా ముంచుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లబొల్లి మాటలతో దోపీడీ చేస్తున్నాడని మండిపడ్డారు. బీసీ పాలసీను అమలు చేస్తామని 4 ఏళ్ల క్రితం మాటిచ్చినా.. ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. బీసీలంటే అంత చులకన ఎందుకని? ప్రశ్నించారు. బీసీలంటే టీఆర్ఎస్​ పార్టీ మీటింగ్​ లకు మందిని తెచ్చేవారు కాదన్నారు.

టీఆర్​ఎస్​ పాలనలో బీసీలను గొర్లు, బర్లు కాసుకునే వారిగా తయారు చేస్తున్నారని, అధికారంలో పాలు పంచుకునే పరిస్థితిని కల్పిచడం లేదన్నారు. చట్టాలు చేసేందుకు అర్హులను చేయడం లేదన్నారు. దీంతో బీసీలు అభివృద్ధికి అమడ దూరంగా ఉంటున్నారని స్పష్టం చేశారు. బీసీ అభివృద్ధిపై 2017లో 210 తీర్మానాలు చేయగా, కనీసం ఒక్కటి కూడా అమల్లోకి రాలేదని ఆమె సోమవారం ట్విట్టర్​ వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News