ఫలించిన పోలీసుల 12 గంటల శ్రమ.. ఆ దొంగ దొరికిండు
దిశ, శంకర్‌పల్లి: అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో సభ్యుడైన హర్షద్ ఖాన్(22) శుక్రవారం తెల్లవారుజామున పోలీసు కస్టడీ నుంచి పరారైన విషయం తెలిసిందే. కాగా, గురువారం సాయంత్రం రిమాండ్‌కు తరలించగా జైలు సమయం పూర్తయిందని వెనుకకు తిప్పి పంపడంతో పోలీసులు నిందితుడ్ని శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి జైలుకు తరలించేందుకు సమాయత్తం అవుతుండగా మూత్రవిసర్జన కోసమని కిందకు దిగిన A1 నిందితుడు హర్షద్ ఖాన్ పోలీసుల కళ్లుగప్పి స్టేషన్ నుంచి పరారయ్యాడు. ఒక్కసారిగా ఉలిక్కి […]
దిశ, శంకర్‌పల్లి: అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో సభ్యుడైన హర్షద్ ఖాన్(22) శుక్రవారం తెల్లవారుజామున పోలీసు కస్టడీ నుంచి పరారైన విషయం తెలిసిందే. కాగా, గురువారం సాయంత్రం రిమాండ్‌కు తరలించగా జైలు సమయం పూర్తయిందని వెనుకకు తిప్పి పంపడంతో పోలీసులు నిందితుడ్ని శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి జైలుకు తరలించేందుకు సమాయత్తం అవుతుండగా మూత్రవిసర్జన కోసమని కిందకు దిగిన A1 నిందితుడు హర్షద్ ఖాన్ పోలీసుల కళ్లుగప్పి స్టేషన్ నుంచి పరారయ్యాడు.
ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ శంకర్‌పల్లి పోలీసులు పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. పత్తేపూర్, చందిప్ప, రావులపల్లికలాన్, రైల్వేట్రాక్, అల్ర్టాటెక్ తదితర ప్రాంతాల్లో చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, ఎస్ఐలు లక్ష్మి నారాయణ, సంజీవ సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు 12 గంటలు శ్రమించిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. కస్టడీ నుంచి పారిపోయిన దొంగ తిరిగి పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు సహకరించిన పత్తేపూర్, సింగపూర్, టవర్, మహాలింగాపురం గ్రామాల యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.