ఇంగ్లాండ్ తొలి టెస్టుకు షమీ దూరం?
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ అడిలైడ్‌లో జరిగిన డే/నైట్ టెస్టులో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీసిన స్కానింగ్‌లో షమీ మణికట్టు దగ్గర విరిగినట్లు తేలింది. దీంతో వైద్యులు అతడిని 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన షమి ఇండియాకు తిరిగి బయలుదేరాడు. అతడి మణికట్టు దగ్గర గాయంతో కనిపించాడు. షమీ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటాడని.. గాయం కాస్త […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ అడిలైడ్‌లో జరిగిన డే/నైట్ టెస్టులో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీసిన స్కానింగ్‌లో షమీ మణికట్టు దగ్గర విరిగినట్లు తేలింది. దీంతో వైద్యులు అతడిని 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన షమి ఇండియాకు తిరిగి బయలుదేరాడు. అతడి మణికట్టు దగ్గర గాయంతో కనిపించాడు. షమీ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటాడని.. గాయం కాస్త తగ్గిన తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని బీసీసీఐ తెలిపింది. షమీ తిరగి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే టీమ్ ఇండియాలోకి తిరిగి వస్తాడని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో అతడు ఆడేది అనుమానంగా మారింది. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది.