అమెజాన్‌లో ‘శకుంతలా దేవి’
దిశ, వెబ్ డెస్క్: అపర గణిత మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న శకుంతలా దేవి బయోపిక్ శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. శకుంతలా దేవి పాత్రలో బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ విద్యాబాలన్ నటించారు. ఎంతో క్లిష్టమైన లెక్కలకు క్షణాల్లో సమాధానం ఇచ్చే శకుంతలాదేవికి మానవ కంప్యూటర్ గా పేరుంది. రెండు 13 అంకెల నెంబర్లను కేవలం 28 సెకన్లలో గణించి ఆమె గిన్నిస్ బుక్‌లో కూడా చోటు సంపాదించారు. భారతీయ మహిళగా, అందులోనూ గణిత మేధావిగా ఒకానొకసమయంలో […]
దిశ, వెబ్ డెస్క్: అపర గణిత మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న శకుంతలా దేవి బయోపిక్ శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. శకుంతలా దేవి పాత్రలో బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ విద్యాబాలన్ నటించారు.
ఎంతో క్లిష్టమైన లెక్కలకు క్షణాల్లో సమాధానం ఇచ్చే శకుంతలాదేవికి మానవ కంప్యూటర్ గా పేరుంది. రెండు 13 అంకెల నెంబర్లను కేవలం 28 సెకన్లలో గణించి ఆమె గిన్నిస్ బుక్‌లో కూడా చోటు సంపాదించారు. భారతీయ మహిళగా, అందులోనూ గణిత మేధావిగా ఒకానొకసమయంలో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినది.
1970ల్లో ఆమె కంప్యూటర్‌తో పోటిపడి మరి లెక్కలు గణన చేయడంతో పై చేయి సాధించేవారు. 1980లో మెదక్ నుంచి లోక్‌సభకు పోటీచేసి నాటి ఐరన్ లేడీ ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయారు.