నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఒక మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న షాహిన్ స్థానిక హాంప్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం మిడిల్‌సెక్స్‌తో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో 6 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్ వేసిన షాహిన్ […]
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఒక మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న షాహిన్ స్థానిక హాంప్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం మిడిల్‌సెక్స్‌తో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో 6 వికెట్లు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్ వేసిన షాహిన్ వరుసగా జాన్ సింప్సన్, స్టీవెన్ ఫిన్, తిలాన్, టిమ్ ముర్తాఘ్‌ను పెవిలియన్ పంపాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మిడిల్‌సెక్స్ జట్టు షాహిన్ దెబ్బకు 121 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. అద్భుత ప్రదర్శన కనబర్చిన షాహీన్ అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా.. పాకిస్థాన్ తరఫున టీ20ల్లో వరుసగా బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షాహీన్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో షాహిన్ తీసిన ఆరు వికెట్లు కూడా క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం.