సంచలన తీర్పు.. మేజరైన అమ్మాయితో ‘సెక్స్’ చేస్తే నేరం కాదట.. కానీ ఇలా చేయడం అనైతికం!

దిశ, వెబ్‌డెస్క్ : ఒక మేజరైన అమ్మాయి, అబ్బాయి ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం (Sexual relation) కొనసాగిస్తే నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శుక్రవారం ఓ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. మారుతున్న కాలాన్ని బట్టి మేజరైన అమ్మాయి, అబ్బాయి ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం కొనసాగిస్తే దానిని నేరంగా పరిగణించలేమని.. కానీ దీనిని అనైతికంగా భావించవచ్చునని పేర్కొంది. ఇలాంటి మానవ […]

Update: 2021-10-30 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఒక మేజరైన అమ్మాయి, అబ్బాయి ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం (Sexual relation) కొనసాగిస్తే నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శుక్రవారం ఓ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. మారుతున్న కాలాన్ని బట్టి మేజరైన అమ్మాయి, అబ్బాయి ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం కొనసాగిస్తే దానిని నేరంగా పరిగణించలేమని.. కానీ దీనిని అనైతికంగా భావించవచ్చునని పేర్కొంది. ఇలాంటి మానవ సంబంధాలు భారతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

వివరాల్లోకివెళితే.. యూపీ రాష్ట్రంలోని అలహాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి ఈ ఏడాది ఫిబ్రవరి 19న కుట్టు శిక్షణా కేంద్రానికి పాఠాలు చెప్పేందుకు వెళ్లింది. ఆ తర్వాత తన ప్రియుడు రాజుతో ఫోన్‌లో మాట్లాడి అతడిని కలవాలని ప్లాన్ చేసింది. వీరిద్దరు కలిసి స్థానిక నదికి సమీపంలో గల ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు.ఈ క్రమంలోనే మరో ముగ్గురు వ్యక్తులు అక్కడికి చేరుకుని రాజుతో తిడుతూ గొడవ పెట్టుకున్నారు.తర్వాత ఆ అమ్మాయిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం ఫిబ్రవరి 20న బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ప్రియుడితో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కౌశాంబిలోని అకిల్ సరాయ్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 376-D, 392, 323, 504, మరియు 506 మరియు POCSO చట్టంలోని 5 మరియు 6 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అయితే, గ్యాంగ్ రేప్ ఘటనలో తనకు సంబంధం లేదని ప్రియుడు రాజు బెయిల్ అప్లై చేసుకోగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రాహుల్ చతుర్వేది అతని అభ్యర్థనను తోసిపుచ్చారు. సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బాధితురాలికి 15ఏళ్లు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మైనర్ బాలికకు బాయ్‌ఫ్రెండ్ అని చెప్పుకునే వ్యక్తి తన ప్రియురాలిని ఇతరులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నప్పుడు రక్షించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రేయసి యొక్క గౌరవం, ప్రతిష్టను కాపాడటం అతని కర్తవ్యం. ఒకవేళ అమ్మాయి మేజర్ అయితే ఆమె సమ్మతితో సెక్స్ చేయడం నేరం కాదు. కానీ, ఆమె మైనర్ అయినప్పుడు సెక్స్ చేస్తే నేరమే అన్నారు. ఖచ్చితంగా అది అనైతికం మరియు భారత సమాజంలో స్థాపించబడిన సామాజిక నిబంధనలకు విరుద్ధం అని తెలిపారు. అందుకోసమే బాలిక ప్రియుడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Tags:    

Similar News