తిరుపతి ఘటనపై CM చంద్రబాబు సీరియస్.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు
తిరుపతి(Tirupati) తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సీరియస్ అయ్యారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సీరియస్ అయ్యారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. డీఎస్పీ రమణకుమార్(DSP Ramanakumar), గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డి(Goshala Director Harinatha Reddy)లను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని.. అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. వీరే కాదు.. ఎస్పీ సుబ్బారాయుడు(SP Subbarayadu), జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
కాగా, ఇప్పటికే తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.
Also Read...
Stampede Effect: శ్రీవారి దర్శన టోకెన్ల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం