అంగం వంకరగా మారుతుందా..? అయితే ఆ లక్షణాలే..!

మేడమ్! నా వయస్సు 49 సంవత్సరాలు. నాకు ఒక సంవత్సరం నుంచీ సెక్స్ సమస్య ఉంది.

Update: 2024-11-09 14:07 GMT

మేడమ్! నా వయస్సు 49 సంవత్సరాలు. నాకు ఒక సంవత్సరం నుంచీ సెక్స్ సమస్య ఉంది. ఐదు నెలల క్రితం నాకు అంగం మొదటి భాగంలో, నా భార్యతో లైంగిక ఉద్రేకం పొందినప్పుడు స్తంభించ లేదు. ఇప్పుడు అంగం మధ్య భాగంలో కూడా స్తంభనలు లేక పోగా ఏవో గడ్డలు తగులుతూ నొప్పిగా ఉంటోంది. మెల్లగా మొత్తం అంగంలో స్తంభనలు పోతాయా? నాకేం వ్యాధి వచ్చింది? చికిత్స ఉందా, తెలుపగలరు?

అంగస్తంభన సమయంలో నొప్పి రావడం, గడ్డల్లాగా ఉండటం అంగంలో పైరోనీస్ డిసీస్ లక్షణాలు. ఈ వ్యాధిలో అంగస్తంభన సమస్య ఉంటుంది. అంగస్తంభన సమయంలో నొప్పి ప్రధాన లక్షణం. అంగంలో గడ్డలుండి స్తంభించినప్పుడు అంగం వంకరగా అవుతుంది. అయితే, ఈ గడ్డలు చికిత్స అవసరం లేకుండా వాటికవే తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు వెంటనే యురాలజిస్ట్ని కలవండి. ఆందోళన అక్కర్లేదు. దీనికి చికిత్స ఉంది.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Read More : నా వయస్సు 16.. సెక్స్‌లో పాల్గొంటున్నట్లు కలలు వచ్చి నిద్రలోనే వీర్య స్ఖలనం అవుతోంది

Tags:    

Similar News