బట్టతల, పెద్ద పొట్ట.. సెక్స్‌లో బలహీనతలు.. అయినా నన్ను సతాయిస్తున్నాడు

మేడమ్.. నా వయసు 55. మెనోపాస్ దశలో ఉన్న నేను సెక్స్ జీవితానికి పనికి రానా..

Update: 2024-12-28 10:32 GMT

మేడమ్.. నా వయసు 55. మెనోపాస్ దశలో ఉన్న నేను సెక్స్ జీవితానికి పనికి రానా.. కొద్దిగా లావయ్యాను. ఆకర్షణ కోల్పోయాను. ఈ మాటలన్నీ మా వారు నాతో తరచూ అంటుంటారు. నిజంగా నేను దాంపత్య జీవితానికి పనికి రానా... ఆయనకి 63 ఏళ్లు. బట్ట తల.. పెద్ద పొట్టతో సెక్స్‌లో బల హీనతలని పెట్టుకొని నన్ను సతాయిస్తున్నారు. ఈ వేధింపులు చిరాగ్గా అనిపిస్తున్నాయి.- లీల, హైద్రాబాద్.

లీల గారూ మీకు 55, మీ వారికి 63 వయసు ఉంది. ఆయన మేల్ మెనోపాస్‌కి చేరుకోలేదా..? ఇంకా యవ్వనంలో ఉన్నారా..? బట్టతల, బానపొట్ట, సెక్స్‌లో బలహీనత ఆయనకీ వచ్చాయని మీరు గుర్తు చేయండి. యవ్వనకాలమంతా మీతో గడిపిన ఆనందమైన దాంపత్య జీవితానికి విలువే లేదా..? తనలో లోపాలు పెట్టుకొని మిమ్మల్ని వేధించడం లౌక్యం కాక మరెంటి? వయాగ్రా వేసుకుంటే కానీ దాంపత్య జీవితం నెరపలేని అతను.. కొద్దిగా లావు తప్ప మరే లోపమూ లేని మిమ్మల్ని వేధించడం ఏమిటి? స్త్రీ, పురుషులు ఇద్దరూ మెనోపాస్/యాండ్రోపాస్ దశలకు చేరుకున్నాక ఇద్దరికీ హార్మోన్ల లోపాలకు సంబంధించిన శారీరిక, మానసిక సమస్యలు ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపం వలన యోని నాళం పొడిబారి కలయికలో మంట, నొప్పితో కూడి ఉండడం వలన సెక్స్‌పట్ల భయము, విముఖత ఉంటుంది. హార్మోన్ల లోపం వలన డి ప్రెషన్, మానసిక వత్తిడికి గురి అవుతూ ఉండడం సెక్స్ పట్ల ఆసక్తి తక్కువగా ఉండేలా చేస్తుంది. భార్య మాత్రమే ముసలిది అయిపోయింది, తనింకా యవ్వనంలోనే ఉన్నాననుకునే భ్రమల్లో బతికే భర్తల వల్ల ఇంకా చిరాకు పెరిగిపోతుంది. ఈ విషయంలో మీ 63 ఏళ్ల భర్త మారాలి. ఇక చికిత్సకు.. పొడి బారిన యోనిలోకి ఈస్ట్రోజెన్ హార్మోన్ క్రీమ్ వాడాలి. ఆహారంలో ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండే సొయా బీన్స్ లాంటి ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. చక్కెర పదార్థాలు తగ్గించాలి. దానివల్ల కొవ్వు పేరుకు పోదు. రోజూ వాకింగ్, యోగా చేస్తూ ఉత్సాహంగా ఉంటే మంచి డిప్రెషన్ తగ్గించే హెల్తీ హార్మోన్లు విడుదల అవుతాయి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Tags:    

Similar News