Interfaith Relationship : ముస్లిం యువకుడితో హిందూ యువతి సహ జీవనం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : ఆమె వయసు 20 ఏళ్లు. అతడి వయసు 19 ఏళ్లు.

Update: 2024-12-14 14:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఆమె వయసు 20 ఏళ్లు. అతడి వయసు 19 ఏళ్లు. హిందూ వర్గానికి చెందిన ఆ యువతి(Hindu woman).. ముస్లిం వర్గానికి చెందిన ఓ యువకుడి(Muslim man)తో ప్రేమలో పడింది. అతడి కోసం ఇంటిని వదిలేసి వచ్చి.. ముంబైలోని చెంబూర్ ఏరియాలో ఉన్న ప్రభుత్వ మహిళల హాస్టల్‌లో ఉంటూ యువకుడితో సహ జీవనాన్ని(interfaith relationship) కొనసాగిస్తోంది. ఆమె తండ్రి, బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి వచ్చి ఎంతో నచ్చజెప్పారు. అయినా సదరు యువతి వినిపించుకోలేదు. తాను ఆ యువకుడినే పెళ్లాడుతానని తేల్చి చెప్పింది. ఈక్రమంలో చెంబూర్ ప్రభుత్వ మహిళల హాస్టల్‌ నుంచి వెళ్లిపోయేందుకు యువతిని అనుమతించాలంటూ.. బాంబే హైకోర్టు(Bombay High Court)లో ఆమె ప్రేమికుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.

దీంతో యువతి తండ్రి కూడా సనా రయీస్ ఖాన్ అనే అడ్వకేట్‌ను అపాయింట్ చేసుకున్నారు. తన కూతురిని తనకు అప్పగించాలని కోర్టును వేడుకున్నారు. ఒకవేళ ఇంటికి తిరిగొచ్చేందుకు కూతురు నో చెబితే.. ఇక ఆమె బతికి లేదని భావిస్తానని తేల్చి చెప్పారు. ఈమేరకు తన గోడును అడ్వకేట్ సనా రయీస్ ఖాన్ ద్వారా కోర్టులో వినిపించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భారతీ డాంగ్రే, మంజూషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలు విన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మేం ఆ యువతి స్వేచ్ఛను హరించలేం. ఆమె లక్కు బాగుండాలని మాత్రమే కోరుకోగలుగుతాం. ఆ యువతి మేజర్.. ఆమె జీవితం, ఆమె ఇష్టం. నచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంది. ఆమె స్వేచ్ఛను కాపాడుతాం’’ అని హైకోర్టు బెంచ్ పేర్కొంది. సదరు యువతిని తల్లిదండ్రుల కస్టడీకి అప్పగించేందుకు ధర్మాసనం నిరాకరించింది.

Tags:    

Similar News