Wild Chiken : సీఎం మెడకు 'వైల్డ్ చికెన్' ఉచ్చు

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Himachal Pradesh CM Sukhvinder Sukhu) 'వైల్డ్ చికెన్'(Wild Chiken) వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2024-12-14 16:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Himachal Pradesh CM Sukhvinder Sukhu) 'వైల్డ్ చికెన్'(Wild Chiken) వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ చికెన్ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా(Simla)లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగు సుఖుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో వైల్డ్ చికెన్‌ను కూడా వడ్డించారు. సీఎం సుఖు ఆ వైల్డ్ చికెన్‌ను తినకపోయినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సహా అక్కడ ఉన్న మిగితా తినడం వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అదే ఆసరాగా తీసుకున్న ప్రతిపక్ష బీజేపీ.. సీఎంపై, కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శల దాడికి దిగింది. అయితే 1972 అటవీ సంరక్షణ చట్టం(WildLife Act 1972) ప్రకారం రక్షిత జాబితాలో ఈ వైల్డ్ చికెన్ ఉండగా.. వాటిని వేటాడటం, తినడం నేరం.

Tags:    

Similar News