ఆరుగురితో రాసలీలలు.. అతడితో ఏడడుగులకు సై..
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో ఆశలతో కెనడా వెళ్లిన యువకుడికి ప్రేమ గాలి సోకింది. అప్పుడు తెలియదు.. ఆ గాలి విషంతో నిండిందని. సిగరెట్ పొగలా ఆమె చుట్టేసినా.. అతడు గ్రహించలేకపోయాడు.. ఆమె బిగి కౌగిలిలో నమ్మక ద్రోహం గూడు కట్టుకుందని. ఆమెతో చేసిన ఆరు నెలల కాపురం.. బంధాలు బలపడతాయనుకున్నాడు.. కానీ బతుకే లేకుండా పోతుందని ఊహించలేకపోయాడు. చల్లటి కొండల్లో వెచ్చని స్పర్శని అందించిన ఆమె.. తుది శ్వాస విడిచేలా చేసిందని తెలుసుకోలేకపోయాడు. మనసారా ప్రేమిస్తే.. […]
దిశ, వెబ్‌డెస్క్ :
ఎన్నో ఆశలతో కెనడా వెళ్లిన యువకుడికి ప్రేమ గాలి సోకింది.
అప్పుడు తెలియదు.. ఆ గాలి విషంతో నిండిందని.
సిగరెట్ పొగలా ఆమె చుట్టేసినా.. అతడు గ్రహించలేకపోయాడు..
ఆమె బిగి కౌగిలిలో నమ్మక ద్రోహం గూడు కట్టుకుందని.
ఆమెతో చేసిన ఆరు నెలల కాపురం.. బంధాలు బలపడతాయనుకున్నాడు..
కానీ బతుకే లేకుండా పోతుందని ఊహించలేకపోయాడు.
చల్లటి కొండల్లో వెచ్చని స్పర్శని అందించిన ఆమె..
తుది శ్వాస విడిచేలా చేసిందని తెలుసుకోలేకపోయాడు.
మనసారా ప్రేమిస్తే.. మోసం చేసిందని ఓ యువకుడు జీవితాన్ని కోల్పోయాడు. నమ్మిన యువతి ఏడగులు నడుస్తానని.. ఎస్కేప్ కావడంతో దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని తెలిసినా.. ఆమె చేసిన గాయం అతడి మనసును మార్చలేక పోయింది. ప్రణయ్ జీవిత ప్రయాణం విషాదంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ప్రణయ్ మాటల్లోనే చదువుదాం…!
‘నా పేరు ప్రణయ్. మాది అనంతపురం జిల్లా కొవ్వూరు. ఉద్యోగ రిత్యా కెనడా వెళ్లాను. అక్కడ మా జిల్లాకే చెందిన అంకిత ( పేరు మార్చాం) పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ఏడాది జనవరిలో నా మనసులోని మాటను ఆమెకు చెప్పాను. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటా..’ అని. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఇక నా సంతోషానికి అవధులు లేవు. నేను మనసు పడిన అందాల దేవత నా జీవిత గుడిలోకి అడుగు పెడుతుంది అని ఊహల గుర్రంపై విహరించ. కానీ ఆ తర్వాతే తెలిసింది.. నా అంకితకు చాలా చెడు అలవాట్లు ఉన్నాయని. నా కంటే ముందే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారితో సెక్స్ లో కూడా పాల్గొన్నదని. అయినా గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు నాతోనే ఉంటుంది. ఇక అన్ని మర్చిపోతుంది అనుకున్నాను. ఆమెకున్న మరో చెడు అలవాటు స్మోకింగ్ చేయడం. నిత్యం 20కి పైగా సిగరెట్లు కాల్చుతుంది. వద్దని వారిస్తే గొడవకు దిగుతుంది. ఆమే నెమ్మదిగా మారతుంది అనుకున్నాను. కానీ నాతో గడుపుతూనే మాజీ బాయ్ ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేయడం.. కాల్స్ మాట్లాడడం చేసేది. అయినా నేను సర్ధుకు పోయి ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని.. కెనడాలో మ్యారేజ్ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాం. ఈలోగా మా నాన్నకు ఆరోగ్యం బాగలేక ఇండియాకు వచ్చాను. ఆ తర్వాత మళ్లీ కెనడా వెళ్లాను. ఇద్దరం ఓకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశాం. ఇలా ఎనిమిది నెలలు కలిసి ఉన్నాక నాతో చెప్పకుండా హెచ్ 1 వీసా వచ్చిందని యూఎస్ వెళ్లిపోయింది. ఇదేంటి అని అడిగితే నాదే తప్పు అన్నట్లు మాట్లాడుతోంది. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. కేవలం మెసేజ్‌లు, ఈ- మెయిల్స్ మాత్రమే చేస్తున్నది. ఇలా ఎంతమందిని మోసం చేస్తుంది. నాకన్న ముందు ఆరుగురితో కలిసి తిరిగి వారిని మోసం చేసింది. ఆమె గురించి తెలిసి కూడా నేను ఆమెపై ఉన్న పిచ్చి ప్రేమతో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అయినా ఇంత దారుణంగా మోసం చేస్తుంది అనుకోలేదు. వాళ్ల అమ్మానాన్న కూడా ఆమె సపోర్ట్ చేస్తున్నారు. ‘మా అమ్మాయి అలాంటిదే. పెళ్లికి ముందు ఇలాంటివి సహజం’అంటున్నారు. ఇదేక్కడి న్యాయం. అమ్మాయిల్లో కూడా ఇంత మోసం చేసే వాళ్లు ఉంటారా..? అవసరానికి వాడుకోని వదిలేస్తారా..? నా ప్రాణానికన్న ఎక్కువ ప్రేమిస్తే.. నా ప్రాణాలనే తీసుకెళ్తుందా..? ఆమె చేసిన మోసం నేను భరించలేక పోతున్నాను. ఇక నేను ప్రాణాలు తీసుకోవడమే మేలు’. అని అనంతపురానికి చెందిన ప్రణయ్ ఆదివారం కెనడాలో నైట్రోజన్ వాయువు తీసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అవయవాలను, శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేయాలని సూసైట్ నోట్ లో కోరాడు.
ఇది నేడు ప్రేమ ముసుగులో చేస్తున్న మోసాలు. అమ్మాయిలు, అబ్బాయిలు.. ప్రేమిస్తే నిజాయితీగా ఉండాలి కానీ.. ఇలా ప్రేమ ముసుగు కప్పుకోని నమ్మకం పేరిట మోసాలకు పాల్పడితే సున్నిత మనస్థత్వం గలవారు తనువు చలిస్తున్నారు. ఇప్పటికైనా అద్దాల మేడల ప్రేమను వదిలి.. అందమైన కుటుంబం కోసం ప్రేమించండి.