సేవాలాల్ మహారాజ్ జయంతి నీ సెలవు దినంగా ప్రకటించాలి…
దిశ,చౌట్కూర్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం గిరిజనులకు ఆరాధ్య దేవుడైన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని కోరుతూ సోమవారం నాడు మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో గిరిజన విద్యార్థి సంఘం ఆందోల్ నియోజకవర్గ అధ్యక్షులు దినేష్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 15 కోట్ల జనాభా గల బంజారా జాతి వారికి ఒక ప్రత్యేకమైన భాషా సంస్కృతి జీవన విధానం కలిగి ఉన్న లంబాడి […]
దిశ,చౌట్కూర్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం గిరిజనులకు ఆరాధ్య దేవుడైన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని కోరుతూ సోమవారం నాడు మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో గిరిజన విద్యార్థి సంఘం ఆందోల్ నియోజకవర్గ అధ్యక్షులు దినేష్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 15 కోట్ల జనాభా గల బంజారా జాతి వారికి ఒక ప్రత్యేకమైన భాషా సంస్కృతి జీవన విధానం కలిగి ఉన్న లంబాడి బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బాలబ్రహ్మచారి శ్రీ శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని 15 ఫిబ్రవరి రోజున సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బంజారా సమాజాభివృద్ధికి కృషి చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున ప్రతి గిరిజన తండాల్లో గిరిజనులు సేవాలాల్ మహారాజ్ వేడుకలు బోగు బండార్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల గిరిజన ప్రజలు పాల్గొన్నారు.