వాటర్ గీజర్ పేలి పలువురికి గాయాలు

దిశ, గద్వాల: గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గద్వాల్ రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ ఎదురుగా జమ్మిచేడుకు వెళ్లే రోడ్డులోని ఓ ఇంట్లో(పై అంతస్తులో) శనివారం సాయంత్రం వాటర్ గీజర్ పేలింది. దాంతో ఇంటి గోడలు, కిటికీలు ఎగిరి రోడ్డు మీద పడటంతో అటుగా వెళ్లే పాదాచారులకు గోడ పెచ్చులు తగిలాయి. ఈ ప్రమాదంలో మోహన్ […]

Update: 2021-11-27 10:23 GMT

దిశ, గద్వాల: గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గద్వాల్ రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ ఎదురుగా జమ్మిచేడుకు వెళ్లే రోడ్డులోని ఓ ఇంట్లో(పై అంతస్తులో) శనివారం సాయంత్రం వాటర్ గీజర్ పేలింది. దాంతో ఇంటి గోడలు, కిటికీలు ఎగిరి రోడ్డు మీద పడటంతో అటుగా వెళ్లే పాదాచారులకు గోడ పెచ్చులు తగిలాయి. ఈ ప్రమాదంలో మోహన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా, విజయ్, చిన్నకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం గాయపడిన వారిని అంబులెన్సులో గద్వాల్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News