ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

దిశ, ఏపీబ్యూరో: ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీతో పాటు మూడో విడత రైతు భరోసా ఇవ్వాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. ​శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ ​సమావేశం జరిగింది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు వెల్లడించారు. ఆమోదించిన ముఖ్యమైన తీర్మానాలు.. – రైతులకు రూ.719 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు, రైతు భరోసా మూడో సీజన్‌కు ఆమోదం. 29న రైతుల అకౌంట్‌లో రైతు భరోసా సొమ్ము […]

Update: 2020-12-18 07:32 GMT

దిశ, ఏపీబ్యూరో: ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీతో పాటు మూడో విడత రైతు భరోసా ఇవ్వాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. ​శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ ​సమావేశం జరిగింది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు వెల్లడించారు.

ఆమోదించిన ముఖ్యమైన తీర్మానాలు..

– రైతులకు రూ.719 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు, రైతు భరోసా మూడో సీజన్‌కు ఆమోదం. 29న రైతుల అకౌంట్‌లో రైతు భరోసా సొమ్ము జమ.

– పశుసంవర్ధకశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నిర్ణయం.

– పులివెందులలో ఏపీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు

– ఆర్డినెన్స్ ద్వారా ఏపీఎంఈఆర్‌సీ ఏర్పాటునకు నిర్ణయం

– 1,100 సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీపై సబ్సిడీ. సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీ అమలు. ఏపీ కొత్త పర్యాటక విధానానికి కేబినెట్‌ ఆమోదం. పర్యాటక ప్రాజెక్టుల పెట్టుబడులకు ప్రోత్సాహకాలు
– ఏప్రిల్, మే, జూన్ కాలానికి పవర్ ఫిక్స్‌డ్ చార్జీల రద్దు.

– రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ఆమోదం. ల్యాండ్ సర్వే, బౌండరీ చట్టంలో 5 సవరణలు, 3 ఏళ్లలో భూ సర్వే పూర్తి చేసి భూహక్కు పత్రాల జారీ. ల్యాండ్ రికార్డుల తయారీకి ఆమోదం

– తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీ ఏర్పాటు. ఏపీ ఐఐసీ ద్వారా ఏర్పాటు చేసే పరిశ్రమల పార్కునకు ఏర్పేడులో పరిహారం చెల్లింపులకు ఆమోదం

– మార్చి నుంచి కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీ. రూ.50 వేల నుంచి రూ. 15 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయం. ఇందుకోసం రూ.198 కోట్ల కేటాయింపు, 6 మాసాలపాటు మారటోరియం. ఎస్ జీఎస్టీ, స్టాంపు డ్యూటీ మినహాయింపుతో ప్రోత్సాహకాలు. రూ.400 కోట్లకు మించి పెట్టుబడులు పెడితే మెగా పరిశ్రమ హోదా. లీజు కాలాన్ని 33 నుంచి 99 ఏళ్లకు పెంచుతూ ఆమోదం.

– చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం నాబార్డు నుంచి రూ. 1931 కోట్ల రుణం కోసం జలవనరుల శాఖకు అనుమతి.

– ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా జాస్తి నాగభూషణం నియామకానికి ఆమోదం.

Tags:    

Similar News