తస్మాత్ జాగ్రత్త.. ఆ వీడియోలు చూసినందుకే ఏడుగురికి ఉరిశిక్ష..
దిశ, వెబ్ డెస్క్: చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలు విధించడం ఆ నియంతకు షరా మామూలే. దక్షిణ కొరియాకు చెందిన కొన్ని వీడియోలు చూశారని ఏకంగా ఏడుగురికి ఉరిశిక్ష విధించాడు కిమ్. ఉత్తర కొరయాకు చెందిన కొందరు దక్షిణ కొరియాకు చెందిన మ్యూజిక్, కొన్ని సినమాలు సీడీల రూపంలోనూ, యూఎస్బీలలో కాపీ చేసి విక్రయించారు. ఈ నేరానికి వాళ్లను ఉరి తీయించాడని ట్రాన్సీషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ అనే మానవ హక్కుల సంఘం తన నివేదికలో […]
దిశ, వెబ్ డెస్క్: చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలు విధించడం ఆ నియంతకు షరా మామూలే. దక్షిణ కొరియాకు చెందిన కొన్ని వీడియోలు చూశారని ఏకంగా ఏడుగురికి ఉరిశిక్ష విధించాడు కిమ్. ఉత్తర కొరయాకు చెందిన కొందరు దక్షిణ కొరియాకు చెందిన మ్యూజిక్, కొన్ని సినమాలు సీడీల రూపంలోనూ, యూఎస్బీలలో కాపీ చేసి విక్రయించారు. ఈ నేరానికి వాళ్లను ఉరి తీయించాడని ట్రాన్సీషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ అనే మానవ హక్కుల సంఘం తన నివేదికలో నమ్మలేని కొరియన్ గాధలను ప్రచురించింది.
దక్షిణ కొరియా నుంచి వలస వచ్చి ఉత్తర కొరియాలో నివసిస్తున్న వారిని అనేక రకాలు గా హింసిస్తున్నాడని కూడా ఈ నివేదిక వెల్లడించింది. వారిని తిరిగి తమ దేశానికి వెల్లే అవకాశం లేకుండా చేశాడని వాపోయింది. ఇంతకు ముందు అనేక ప్రసంగాలలో దక్షిణ కొరియా పై తమ ప్రజలకు సానుభూతి ఉండకూడదని చెప్పాడు.
అలా ఎవరైనా ప్రేరేపిస్తే తీవ్ర మైన శిక్షలు ఉంటాయని కూడా హెచ్చరించాడు. నియంత కిమ్ ఇప్పుడు అన్నంత పనీ చేశాడు.