సీరియల్ నటి విశ్వశాంతి మృతి

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటి, యాంకర్ విశ్వశాంతి అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ ఇంజినీర్స్ కాలనీలో మూడేళ్లుగా నివాసముంటున్న ఆమె.. చుట్టపక్కల వారితో క్లోజ్‌గా ఉంటుంది. అయితే శాంతి నాలుగు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా నిర్జీవంగా కనిపించింది శాంతి. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో […]

Update: 2020-04-09 06:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటి, యాంకర్ విశ్వశాంతి అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ ఇంజినీర్స్ కాలనీలో మూడేళ్లుగా నివాసముంటున్న ఆమె.. చుట్టపక్కల వారితో క్లోజ్‌గా ఉంటుంది. అయితే శాంతి నాలుగు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా నిర్జీవంగా కనిపించింది శాంతి. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… సీసీటీవీ ఫుటేజీ, మృతురాలి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శాంతి మృతిపై పలువురు సీరియల్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. కాగా శాంతి విశాఖ జిల్లా వాస్తవ్యురాలు..

Tags: Vishwa Shanthi, Shanthi, Anchor, Serial Actress

Tags:    

Similar News

టైగర్స్ @ 42..