కరోనా భయంలో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లను కరోనా భయం వీడటంలేదు. మంగళవారం నష్టాలతో మొదలైన మార్కెట్లు చివరి వరకూ లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడాయి. మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి అధికమవడంతో ముగిసే సమయానికి భారీ నష్టాలనే నమోదు చేశాయి. సెన్సెక్స్ 810.98 పాయింట్లను కోల్పోయి 30,579 వద్ద క్లోజయింది. నిఫ్టీ 230.35 పాయింట్ల నష్టంతో 8,967 వద్ద ముగిసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.23 వద్ద ఉంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, హీరో మోటోకార్ప్, […]

Update: 2020-03-17 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లను కరోనా భయం వీడటంలేదు. మంగళవారం నష్టాలతో మొదలైన మార్కెట్లు చివరి వరకూ లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడాయి. మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి అధికమవడంతో ముగిసే సమయానికి భారీ నష్టాలనే నమోదు చేశాయి. సెన్సెక్స్ 810.98 పాయింట్లను కోల్పోయి 30,579 వద్ద క్లోజయింది. నిఫ్టీ 230.35 పాయింట్ల నష్టంతో 8,967 వద్ద ముగిసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.23 వద్ద ఉంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో క్లోజవ్వగా, ఐసిఐసీఇ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీలో యెస్ బ్యాంకు, హిందూస్తాన్ పెట్రోలియం, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్లో కదలాడగా భారతీ ఇన్‌ఫ్రాటెల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ షేర్లు నష్టాలను చూశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటుందనే ఆందోళన వ్యక్తం చేయడంతో యూఎస్ మార్కెట్లు భారీగా దిగజారాయి. 1987 తర్వాత వాల్ స్ట్రీట్ పతనాన్ని ఈ స్థాయిలో చూడటం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ప్రస్తుతం కరోనా వైరస్‌ను అరికట్టడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టామని, మార్కెట్ల గురించి ఆలోచించదంలేదని ట్రంప్ అన్నారు.

అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో అత్యధికంగా 14,000 కరోనా కేసులు నమోదు కావడం కూడా మార్కెట్లపై అధిక ప్రభావాన్ని చూపించాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 14 వేల కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీంతో, రానున్న కాలంలో ఇండియాపై కరోనా ప్రభావం మరింత పెరిగే అవకాశాలున్నట్లు, ఇండియాలో అనేక మార్పులు ఏర్పడే పరిస్థితి ఉందనే ఊహాగానాలతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బ తినొచ్చని భావిస్తున్నారు. కరోనా ఇలాగే కొనసాగితే దేశీయంగా సంస్థలకు భారీగా నష్టాలు తప్పవని భావించి మదుపర్లు ఎక్కువగా అమ్మకాలకు సిద్ధమయ్యారు.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News