నష్టాలతో మొదలైన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లకు కరోనా భయం పోలేదు. గురువారం సెలవు అనంతరం మొదలైన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై ఎలాంటి సంకేతాలను ఇవ్వకపోవడంతో మదుపర్లలో నిరుత్సాహం అలుముకుంది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కూడా ప్రభావితం చేశాయి. ఉదయం 9.50 గంటల సమయానికి సెన్సెక్స్ 222.72 పాయింట్లు నష్టపోయి 28,042 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64.70 పాయింట్ల నష్టంతో 8,189 […]

Update: 2020-04-02 23:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లకు కరోనా భయం పోలేదు. గురువారం సెలవు అనంతరం మొదలైన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై ఎలాంటి సంకేతాలను ఇవ్వకపోవడంతో మదుపర్లలో నిరుత్సాహం అలుముకుంది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కూడా ప్రభావితం చేశాయి. ఉదయం 9.50 గంటల సమయానికి సెన్సెక్స్ 222.72 పాయింట్లు నష్టపోయి 28,042 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64.70 పాయింట్ల నష్టంతో 8,189 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాన్ ఫినాన్స్, ఓఎన్‌జీసీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా గురువారం ఒక్కరోజే క్రూడ్ ఆయిల్ ధరలు 25 శాతం పెరిగాయి. ఈ పరిణామాలతో అమెరికా మార్కెట్లు లాభపడినప్పటికీ ఆసియా మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. మిగిలిన రంగాల కంటే బ్యాంకింగ్ రంగం అధిక నష్టాలను నమోదు చేస్తున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News