సంతృప్తికరంగా లే..నందునే..!

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సంతృప్తికరంగా లేకపోవడంతో మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. తొలుత ఇంట్రాడేలో దాదాపు 400 వరకూ నష్టపోయిన మార్కెట్లు లంచ్ సమయం తర్వాత కొంత కోలుకుని స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 25.16 పాయింట్లు నష్టపోయి 31,097 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 5.90 పాయింట్లు కోల్పోయి 9,136 వద్ద ముగిసింది. మెటల్ మినహాయించి మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. రిలయన్స్, ఎయిర్‌టెల్ కొనుగోళ్లతో మార్కెట్లు నష్టాల నుంచి కొంతవరకూ కోలుకున్నాయి. […]

Update: 2020-05-15 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సంతృప్తికరంగా లేకపోవడంతో మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. తొలుత ఇంట్రాడేలో దాదాపు 400 వరకూ నష్టపోయిన మార్కెట్లు లంచ్ సమయం తర్వాత కొంత కోలుకుని స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 25.16 పాయింట్లు నష్టపోయి 31,097 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 5.90 పాయింట్లు కోల్పోయి 9,136 వద్ద ముగిసింది. మెటల్ మినహాయించి మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. రిలయన్స్, ఎయిర్‌టెల్ కొనుగోళ్లతో మార్కెట్లు నష్టాల నుంచి కొంతవరకూ కోలుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, టాటాస్టీల్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, ఐటీసీ, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన సూచీలన్నీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మెటల్ సహా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ రంగాల షేర్లు కొనుగోళ్ల మద్దతు తెచ్చుకున్నాయి. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.56 వద్ద ఉంది.

Tags:    

Similar News