భారీ నష్టాలతో మొదలైన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను ప్రమాదంలో పడేయగలదని ఆదివారం రోజున ఐఎమ్ఎఫ్ హెచ్చరించిన నేపథ్యంలో సోమవారం స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. పైగా చైనాలో కాకుండా ఇతర దేశాల్లో కరోనా మరణాలు పెరగడం కూడా మదుపర్ల భయానికి కారణమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 417.37 పాయింట్ల నష్టంతో 40,752 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 129.40 పాయింట్లు కోల్పోయి 11,951 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టాటా […]

Update: 2020-02-24 00:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను ప్రమాదంలో పడేయగలదని ఆదివారం రోజున ఐఎమ్ఎఫ్ హెచ్చరించిన నేపథ్యంలో సోమవారం స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. పైగా చైనాలో కాకుండా ఇతర దేశాల్లో కరోనా మరణాలు పెరగడం కూడా మదుపర్ల భయానికి కారణమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 417.37 పాయింట్ల నష్టంతో 40,752 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 129.40 పాయింట్లు కోల్పోయి 11,951 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.88 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News