FMCG: ముడి పామాయిల్ కారణంగా పెరుగుతున్న సబ్బులు, వంట నూనె ధరలు

గడిచిన మూడు నెలల కాలంలో ముడి పామాయి ధర 45.2 శాతం పెరిగింది.

Update: 2024-10-27 17:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ముడి పామాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రజలపై ధరల భారం మోపుతున్నాయి. ఇప్పటికే కంపెనీలు సబ్బులు, వంట నూనె రేట్లను పెంచడం ప్రారంభించాయి. కొన్ని రకాల వస్తువుల తయారీలో ముడి పామాయిల్ ప్రధాన ముడిసరుకుగా ఉంటుంది. అయితే, గడిచిన మూడు నెలల కాలంలో ముడి పామాయి ధర 45.2 శాతం పెరిగింది. దేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటైన హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) స్కిన్ క్లెన్సింగ్ విభాగంలో ఇప్పటికే ధరలు పెంచింది. అలాగే, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఎండీ, సీఈఓ సుధీర్ సీతాపతి ఓ కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుతూ.. ఉత్పత్తుల ధరలను పెంచడం ద్వారా ముడి పామాయిల్ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ముడి చమురు దిగుమతులపై సుంకం కారణంగా ఇప్పటికే వివిధ రకాల ఉత్పత్తులు ఖరీదయ్యాయి. అయితే, ఇది కొద్ది కాలానికే పరిమితమని, రానున్న త్రైమాసికాల్లో సాధ్యమైనంతవరకు ప్రజలపై ఎక్కువ భారం వేయకుండా ఖర్చులకు తగినట్టుగా, మార్జిన్ పొందే చర్యలు తీసుకుంటామని సుధీర్ వెల్లడించారు. 

Tags:    

Similar News