ఊగిసలాటలో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో గురువారం దేశీయ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు లాభ నష్టాల మధ్య ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్ 51.20 పాయింట్ల నష్టంతో 30,328 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 5.40 స్వల్ప లాభంతో 8,930 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురవుతుండగా, ఎఫ్ఎమ్‌సీజీ, ఫార్మా రంగాలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్‌టీ, […]

Update: 2020-04-16 00:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో గురువారం దేశీయ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు లాభ నష్టాల మధ్య ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్ 51.20 పాయింట్ల నష్టంతో 30,328 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 5.40 స్వల్ప లాభంతో 8,930 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురవుతుండగా, ఎఫ్ఎమ్‌సీజీ, ఫార్మా రంగాలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్‌టీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News