లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మరోసారి లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాల నేపథ్యంలో సూచీలు దేశీయంగా ఒమిక్రాన్ భయాలను అధిగమించి వరుసగా మూడో సెషన్‌లో మెరుగ్గా ర్యాలీని కొనసాగించాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల ప్రమాదం తక్కువగా ఉందనే అధ్యయనాల కారణంగా మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. దీనికితోడు పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం తో స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 384.72 పాయింట్లు ఎగసి 57,315 […]

Update: 2021-12-23 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మరోసారి లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాల నేపథ్యంలో సూచీలు దేశీయంగా ఒమిక్రాన్ భయాలను అధిగమించి వరుసగా మూడో సెషన్‌లో మెరుగ్గా ర్యాలీని కొనసాగించాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల ప్రమాదం తక్కువగా ఉందనే అధ్యయనాల కారణంగా మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. దీనికితోడు పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం తో స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 384.72 పాయింట్లు ఎగసి 57,315 వద్ద, నిఫ్టీ 117.15 పాయింట్లు లాభపడి 17,072 వద్ద ముగిసింది. నిఫ్టీ లో దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా కదలాడాయి. ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ రంగాలు 1.5 శాతానికి పైగా జంప్ చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, విప్రో, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్ఎం షేర్లు అధిక లాభాల్లో ట్రేడవ్వగా, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, ఆల్ట్రా సిమెంట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.22 వద్ద ఉంది.

Tags:    

Similar News