లాభాలతో ముగిసిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలతో సతమతమవుతున్న మార్కెట్లకు కాస్త ఆందోళన తగ్గింది. ఇన్నాళ్లు నష్టాలతో ముగుస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం లాభాలతో క్లోజయ్యాయి. కరోనా భయంతో ఇన్నాళ్లు భారీ పతనాలను చూశాయి. ఇప్పటికే కొన్ని లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ప్రధాన కంపెనీల షేర్లు సైతం భారీ స్థాయిలో దిగజారడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1627.73 పాయింట్లు లాభపడి 29,915 వద్ద క్లోజయింది. నిఫ్టీ 482 పాయింట్ల లాభంతో […]

Update: 2020-03-20 05:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలతో సతమతమవుతున్న మార్కెట్లకు కాస్త ఆందోళన తగ్గింది. ఇన్నాళ్లు నష్టాలతో ముగుస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం లాభాలతో క్లోజయ్యాయి. కరోనా భయంతో ఇన్నాళ్లు భారీ పతనాలను చూశాయి. ఇప్పటికే కొన్ని లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ప్రధాన కంపెనీల షేర్లు సైతం భారీ స్థాయిలో దిగజారడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1627.73 పాయింట్లు లాభపడి 29,915 వద్ద క్లోజయింది. నిఫ్టీ 482 పాయింట్ల లాభంతో 8,745 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ 18.58 శాతం, హిందూస్తాన్ యూనిలీవర్ 11.75 శాతం, ఆల్ట్రాటెక్ సిమెంట్ 13.01 శాతం, రిలయన్స్ 11.24 శాతం, టీసీఎస్ 9.90 శాతం, టాటాస్టీల్ 9.60 శాతం లాభాలతో క్లోజవ్వగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రమే నష్టాలతో ముగిశాయి. అన్ని రంగాల కంటే బ్యాంకింగ్ రంగం షేర్లు అధిక లాభాలతో క్లోజవడం విశేషం.

tags : sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News