లాభాల బాట పట్టిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక ఉద్దీపనల తర్వాత మార్కెట్లు లాభాలను చూస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం 2.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. దేశీయంగా కేంద్రం తీసుకున్న చర్యలు కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి. కరోనా పుట్టిన వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో మార్కెట్లకు కలిసొచ్చింది. కొద్దిరోజుల్లో ఉత్పత్తి, పంపిణీలు మాములుగా జరుగుతాయనే సంకేతాలతో మార్కెట్లకు ఊరట లభించింది. ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో దేశీయంగా సూచీలన్నీ లాభాల్లో కదలాడుతున్నాయి. గురువారం లాభాలతో […]

Update: 2020-03-25 23:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక ఉద్దీపనల తర్వాత మార్కెట్లు లాభాలను చూస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం 2.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. దేశీయంగా కేంద్రం తీసుకున్న చర్యలు కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి. కరోనా పుట్టిన వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో మార్కెట్లకు కలిసొచ్చింది. కొద్దిరోజుల్లో ఉత్పత్తి, పంపిణీలు మాములుగా జరుగుతాయనే సంకేతాలతో మార్కెట్లకు ఊరట లభించింది. ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో దేశీయంగా సూచీలన్నీ లాభాల్లో కదలాడుతున్నాయి.

గురువారం లాభాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.15 సమయానికి సెన్సెక్స్ 1300.53 పాయింట్ల లాభంతో 29,836 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ సైతం 425.30 పాయింట్లు లాభపడి 8,743 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 30 శాతం లాభాలతో ట్రేడవుతుండగా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ 10 శాతానికిపైగా అధిక లాభాలతో కొనసాగుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News