కొనసాగుతున్న మార్కెట్ల పతనం!

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాలతో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఊహించని స్థాయిలో పతనమయ్యాయి. బ్యారెల్ 20 డాలర్ల వరకు పడిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. దేశీయంగా మార్కెట్లు ఉదయం 10.45 సమయానికి 5 శాతం క్షీణించి సెన్సెక్స్ 1611.79 పాయింట్లను కోల్పోయి 27,257 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 476.35 పాయింట్ల నష్టంతో 7,992 వద్ద […]

Update: 2020-03-19 00:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాలతో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఊహించని స్థాయిలో పతనమయ్యాయి. బ్యారెల్ 20 డాలర్ల వరకు పడిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. దేశీయంగా మార్కెట్లు ఉదయం 10.45 సమయానికి 5 శాతం క్షీణించి సెన్సెక్స్ 1611.79 పాయింట్లను కోల్పోయి 27,257 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 476.35 పాయింట్ల నష్టంతో 7,992 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో దాదాపు అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్, ఐటీసీ మినహా మిగిలిన సూచీలన్నీ నేలచూపులు చూస్తున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News