మార్కెట్ల నష్టాలకు బ్రేక్!

దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ల వరుస నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సూచనలు రావడంతో మదుపర్లలో కరోనా వైరస్ గురించి ఆందోళనలు తొలిగాయి. 41 వేలకు దిగువన కొనసాగిన మార్కెట్లు బుధవారం ప్రారంభమే 381 పాయింట్ల లాభంతో 41,276 వద్ద మొదలైంది. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 12,107 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌లో దాదాపు అన్ని సూచీలు లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. ఎన్‌టీపీసీ అత్యధికంగా 2.73 శాతం లాభపడింది. యాక్సిస్ బ్యాంక్, […]

Update: 2020-02-19 00:43 GMT

దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ల వరుస నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సూచనలు రావడంతో మదుపర్లలో కరోనా వైరస్ గురించి ఆందోళనలు తొలిగాయి. 41 వేలకు దిగువన కొనసాగిన మార్కెట్లు బుధవారం ప్రారంభమే 381 పాయింట్ల లాభంతో 41,276 వద్ద మొదలైంది. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 12,107 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌లో దాదాపు అన్ని సూచీలు లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. ఎన్‌టీపీసీ అత్యధికంగా 2.73 శాతం లాభపడింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ సూచీలు 1 శాతానికి పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీలో సైతం అన్ని రంగాలు సానుకూలంగానే కొనసాగుతున్నాయి.

‘‘మోకు దెబ్బ సదస్సుకు రండి’’

Full View

Tags:    

Similar News