మూడో సెషన్‌లోనూ లాభాల్లో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా మూడో సెషన్‌లో కూడా కీలకమైన సూచీలన్నీ సానుకూలంగా కదలాడుతున్నాయి. ఆర్థిక ఉద్దీపనలతో యూఎస్ మార్కెట్లు సైతం లాభాలను చూస్తున్నాయి. ఈ ప్రభావం కూడా దేశీయ మార్కెట్లపై కొనసాగుతోంది. ఉదయం 10.15 సమయంలో సెన్సెక్స్ 462.98 పాయింట్ల లాభంతో 30,505 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 195 పాయింట్లు లాభపడి 8,836 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, […]

Update: 2020-03-26 23:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా మూడో సెషన్‌లో కూడా కీలకమైన సూచీలన్నీ సానుకూలంగా కదలాడుతున్నాయి. ఆర్థిక ఉద్దీపనలతో యూఎస్ మార్కెట్లు సైతం లాభాలను చూస్తున్నాయి. ఈ ప్రభావం కూడా దేశీయ మార్కెట్లపై కొనసాగుతోంది. ఉదయం 10.15 సమయంలో సెన్సెక్స్ 462.98 పాయింట్ల లాభంతో 30,505 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 195 పాయింట్లు లాభపడి 8,836 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాలతో కొనసాగుతుండగా, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, హెచ్‌సీఎల్, బజాజ ఆటో షేర్లు నష్టాలతో కదులుతున్నాయి.

మార్కెట్లు ప్రారంభమైన సమయంలో సెన్సెక్స్ 32 వేలు, నిఫ్టీ 9 వేల మార్కును దాటినప్పటికీ తర్వాత నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా రంగాలు అధిక లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. ఆర్‌బీఐ రెపో రేటును 4.4 శాతానికి తగ్గించారు. రివర్స్ రెపో రేటును 4 శాతానికి తగ్గించారు. ఆర్‌బీఐ ఆర్థిక ప్యాకేజీ అంశంపై అంచనాలు అధికం కావడం మదుపర్ల సెంటిమెంట్‌ని బలపరుస్తోంది. అయితే, మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నప్పటికీ ఆర్‌బీఐ ప్రకటన తర్వాత మార్కెట్ల కదలికలు మారొచ్చని, మరింత అప్రమత్తత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక, యూఎస్ డాలరుతో రూపాయి మారకం ఇలువ స్వల్పంగా బలపడి రూ. 74.69 వద్ద ఉంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market, coronavirus

Tags:    

Similar News