లాభాల్లో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా భయాల నుంచి మదుపర్లు ఇంకా బయటపడినట్లు లేదు. దేశీయ మార్కెట్లు నష్టాల నుంచి శుక్రవారం కాస్త కోలుకుని స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ కరోనాపై పోరాడేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రత్యేకమైన టాస్క్‌ఫోర్స్ ఏర్పాడి ఆర్థిక వ్యవస్థను కాపాడాగలరనే ప్రకటన కాస్త సానుకూల ప్రభావాన్ని ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదయం 11 గంటలకు సెన్సెక్స్ 233.96 పాయింట్లు లాభపడి 28,522 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 88.15 పాయింట్ల లాభంతో […]

Update: 2020-03-20 00:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా భయాల నుంచి మదుపర్లు ఇంకా బయటపడినట్లు లేదు. దేశీయ మార్కెట్లు నష్టాల నుంచి శుక్రవారం కాస్త కోలుకుని స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ కరోనాపై పోరాడేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రత్యేకమైన టాస్క్‌ఫోర్స్ ఏర్పాడి ఆర్థిక వ్యవస్థను కాపాడాగలరనే ప్రకటన కాస్త సానుకూల ప్రభావాన్ని ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదయం 11 గంటలకు సెన్సెక్స్ 233.96 పాయింట్లు లాభపడి 28,522 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 88.15 పాయింట్ల లాభంతో 8,351 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిసి, పవర్‌గ్రిడ్ షేర్లు అధిక లాభాలతో కొనసాగుతుండగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ, ఇండస్ఇండ్ బ్యాంకుల షేర్లు అధిక నష్టాలతో ట్రేడవుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News