ఒడిదుడుకుల్లో మార్కెట్లు..పెరిగిన యెస్ బ్యాంకు షేర్ ధర!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్ల ఊగిసలాట ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం భారీ నష్టాల అనంతరం బుధవారం ప్రారంభమైన మార్కెట్లు ఉదయం నుంచే ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉండటంతో బుధవారం వచ్చిన లాభాలు ఎంతమేరకు మార్కెట్లను కాపాడతాయనేది సందేహమేనని మాకెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యెస్ బ్యాంకు షేర్లు బుధవారం సైతం జోరును కొనసాగించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 62.45 పాయింట్ల నష్టంతో 35,697 వద్ద ముగిసింది. నిఫ్టీ 2.55 స్వల్ప నష్టంతో […]

Update: 2020-03-11 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్ల ఊగిసలాట ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం భారీ నష్టాల అనంతరం బుధవారం ప్రారంభమైన మార్కెట్లు ఉదయం నుంచే ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉండటంతో బుధవారం వచ్చిన లాభాలు ఎంతమేరకు మార్కెట్లను కాపాడతాయనేది సందేహమేనని మాకెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యెస్ బ్యాంకు షేర్లు బుధవారం సైతం జోరును కొనసాగించాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 62.45 పాయింట్ల నష్టంతో 35,697 వద్ద ముగిసింది. నిఫ్టీ 2.55 స్వల్ప నష్టంతో 10,448 వద్ద క్లోజయింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హీరో మోటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News