అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పడలేదు. ఉదయం 200 పాయింట్ల లాభంతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో సూచీలు ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక వెయిటేజీ ఉన్న షేర్ల పతనం కూడా మార్కెట్ల నష్టానికి కారణమయ్యాయి. ఎక్కువగా బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక రంగం, మీడియా రంగాల్లో షేర్ల అమ్మకాలు పెరిగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 310.21 పాయింట్లను కోల్పోయి 30,379 వద్ద ముగిసింది. నిఫ్టీ 68.55 […]

Update: 2020-04-15 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పడలేదు. ఉదయం 200 పాయింట్ల లాభంతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో సూచీలు ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక వెయిటేజీ ఉన్న షేర్ల పతనం కూడా మార్కెట్ల నష్టానికి కారణమయ్యాయి. ఎక్కువగా బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక రంగం, మీడియా రంగాల్లో షేర్ల అమ్మకాలు పెరిగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 310.21 పాయింట్లను కోల్పోయి 30,379 వద్ద ముగిసింది. నిఫ్టీ 68.55 పాయింట్లు నష్టపోయి 8,925 వద్ద క్లోజయింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్, ఐటీసీ, నెస్లే ఇండియా సూచీలు లాభాల్లో ట్రేడవ్వగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను చూశాయి. బ్యాంక్ నిఫ్టీ 3 శాతం నష్టాలను చూడగా, రియల్టీ, మెటల్, ఎఫ్ఎమ్‌సీ, ఐటీ షేర్ల కొనుగోళ్లు తక్కువగా జరిగాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక రంగం షేర్లు అధిక నష్టాలను ఎదుర్కొన్నాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News