స్వల్పంగా లాభపడిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా కరోన కేసులు పెరగడంతో బుధవారం మార్కెట్లు ఊగిసలాటకు గురయ్యాక గురువారం కాస్త కోలుకున్నాయి. దేశంలో కరోన ప్రభావం ఆర్థిక రంగంపై ఎలా ఉంటుందో పెట్టుబడిదారులు అవగాహన చేసుకోవడంతో మార్కెట్లో సానుకూలత ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 61.13 పాయింట్ల స్వల్ప లాభంతో 38,470 వద్ద క్లోజయింది. నిఫ్టీ 18 పాఇంట్లు లాభపడి 11,269 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా […]

Update: 2020-03-05 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా కరోన కేసులు పెరగడంతో బుధవారం మార్కెట్లు ఊగిసలాటకు గురయ్యాక గురువారం కాస్త కోలుకున్నాయి. దేశంలో కరోన ప్రభావం ఆర్థిక రంగంపై ఎలా ఉంటుందో పెట్టుబడిదారులు అవగాహన చేసుకోవడంతో మార్కెట్లో సానుకూలత ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 61.13 పాయింట్ల స్వల్ప లాభంతో 38,470 వద్ద క్లోజయింది. నిఫ్టీ 18 పాఇంట్లు లాభపడి 11,269 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా రిలయన్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

tags : Sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News