రుచించని ప్యాకేజీ.. నష్టాల్లో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ మార్కెట్లకు రుచించలేదు. బుధవారం ప్యాకేజీ ఆశలతో దూసుకెళ్లినప్పటికీ గురువారం ఆ లాభాలన్నీ ఆవిరయ్యాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నష్టాలు తప్పలేదు. పైగా, వృద్ధిపై దీర్ఘకాలం కరోనా ప్రభావం తప్పదనే యూఎస్ ఫెడ్ హెచ్చరికలతో మదుపరులు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించారు. ఆరంభంలో వచ్చిన నష్టాల నుంచి తేరుకున్నట్టు కనబడినప్పటికీ..లంచ్ సమయం తర్వాత మరింత పడిపోయింది. సెన్సెక్స్ 885.72 పాయింట్ల నష్టంతో 31,122 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ […]

Update: 2020-05-14 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ మార్కెట్లకు రుచించలేదు. బుధవారం ప్యాకేజీ ఆశలతో దూసుకెళ్లినప్పటికీ గురువారం ఆ లాభాలన్నీ ఆవిరయ్యాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నష్టాలు తప్పలేదు. పైగా, వృద్ధిపై దీర్ఘకాలం కరోనా ప్రభావం తప్పదనే యూఎస్ ఫెడ్ హెచ్చరికలతో మదుపరులు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించారు. ఆరంభంలో వచ్చిన నష్టాల నుంచి తేరుకున్నట్టు కనబడినప్పటికీ..లంచ్ సమయం తర్వాత మరింత పడిపోయింది. సెన్సెక్స్ 885.72 పాయింట్ల నష్టంతో 31,122 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 240.88 పాయింట్లను కోల్పోయి 9,142 వద్ద ముగిసింది. ఎఫ్ఎమ్‌సీజీ, ఫార్మా రంగాలు మినహాయించి అన్ని రంగాల షేర్లకు నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్, మెటల్, బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. టెలికాం రంగాలకు సైతం నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హీరో మోటోకార్ప్, ఆల్ట్రాటెక్, మారుతీ సుజుకి, ఎల్‌టీ, ఎయిర్‌టెల్, బ్రిటానియా లాభపడగా, హిందాల్‌కో, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, పవర్‌గ్రిడ్, గెయిల్, ఇండస్ఇండ్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టపోయాయి. ఇక, యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.56 వద్ద బలహీనంగా ఉంది.

Tags:    

Similar News