లాభాలతో మొదలైన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయనే ఆందోళనలో బుధవారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు గురువారం కొంత లాభాల్లో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 298.86 పాయింట్ల లాభంతో 38,708 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 62.05 పాయింట్లు లాభపడి 11,313 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లోని సూచీలన్నీ లాభాల్లోనే కదులుతున్నాయి. కోటక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలివర్ అత్యధికంగా 3 శాతం లాభాలతో కొనసాగుతుంటే, ఎస్‌బీఐ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీలో ఫార్మా […]

Update: 2020-03-04 23:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయనే ఆందోళనలో బుధవారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు గురువారం కొంత లాభాల్లో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 298.86 పాయింట్ల లాభంతో 38,708 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 62.05 పాయింట్లు లాభపడి 11,313 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లోని సూచీలన్నీ లాభాల్లోనే కదులుతున్నాయి. కోటక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలివర్ అత్యధికంగా 3 శాతం లాభాలతో కొనసాగుతుంటే, ఎస్‌బీఐ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీలో ఫార్మా రంగం ఒక శాతం, మెటల్, ఐటీ రంగం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News