కరోనా భయంతో మళ్లీ నష్టాల్లో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనప్పటికీ నష్టాలతోనే ముగిశాయి. చివరి గంటలో ఒక శాతానికి పైగా మార్కెట్లు నష్టపోయాయి. దీనికి ప్రధానంగా ఇండియాలో రెండు కొత్త కేసులు నమోదు కావడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో ఒకటి, హైదరాబద్‌లో మరొక కేసు నమోదయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153.27 పాయింట్లను కోల్పోయి 38,144 వద్ద క్లోజయింది. నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 11,132 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్, నెస్లె ఇండియా, […]

Update: 2020-03-02 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనప్పటికీ నష్టాలతోనే ముగిశాయి. చివరి గంటలో ఒక శాతానికి పైగా మార్కెట్లు నష్టపోయాయి. దీనికి ప్రధానంగా ఇండియాలో రెండు కొత్త కేసులు నమోదు కావడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో ఒకటి, హైదరాబద్‌లో మరొక కేసు నమోదయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153.27 పాయింట్లను కోల్పోయి 38,144 వద్ద క్లోజయింది. నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 11,132 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్, నెస్లె ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ లాభాల్లో ట్రేడవ్వగా, టాటా స్టీల్, ఎస్‌బీఐ, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

Tags : Sensex, Nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News