ఆటుపోట్లకు గురైన స్టాక్ మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం ప్రారంభం నుంచి లాభాలతో మొదలిన సూచీలు చివరి వరకు ఆటుపోట్లను ఎదుర్కొంటూనే కొనసాగాయి. అమెరికాలో ఉద్యోగాల వివరాల వార్తలతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. అనంతరం మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో చివర్లో ఆటుపోట్లకు గురయ్యాయని విశ్లేషకులు తెలిపారు. ప్రధానంగా చమురు ధరల ఒత్తిడి కారణంగా సోమవారం మార్కెట్ల ర్యాలీని కంగారు పెట్టాయి. బ్రెంట్ కూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 70 […]

Update: 2021-03-08 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం ప్రారంభం నుంచి లాభాలతో మొదలిన సూచీలు చివరి వరకు ఆటుపోట్లను ఎదుర్కొంటూనే కొనసాగాయి. అమెరికాలో ఉద్యోగాల వివరాల వార్తలతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. అనంతరం మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో చివర్లో ఆటుపోట్లకు గురయ్యాయని విశ్లేషకులు తెలిపారు. ప్రధానంగా చమురు ధరల ఒత్తిడి కారణంగా సోమవారం మార్కెట్ల ర్యాలీని కంగారు పెట్టాయి. బ్రెంట్ కూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్లు దాటిపోవడంతో దేశీయ మార్కెట్లపై ప్రతికూల సంకేతాలు అందాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 35.75 పాయింట్లు లాభపడి 50,441 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 14,956 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ 1.6 శాతం మేర బలపడగా, మీడియా, మెటల్, ఐటీ, ఫార్మా సూచీలు పుంజుకున్నాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, ఆటో రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.20 వద్ద ఉంది.

Tags:    

Similar News