బీఎస్ఈ 30 లో భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ పతనం.. లాభాలు ఎవరికంటే..?

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం ప్రారంభమైన సమయంలో ఆసియా మార్కెట్ల మద్దతుతో లాభాల్లో ట్రేడయిన సూచీలు అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో బలహీనపడ్డాయి. ప్రధానంగా టెలికాం, ఐటీ, ఎనెర్జీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు నీరసించాయి. ఇదే సమయంలో ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్ లాంటి కీలక స్టాక్స్ కూడా పతనం కావడంతో మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో […]

Update: 2021-07-12 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం ప్రారంభమైన సమయంలో ఆసియా మార్కెట్ల మద్దతుతో లాభాల్లో ట్రేడయిన సూచీలు అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో బలహీనపడ్డాయి. ప్రధానంగా టెలికాం, ఐటీ, ఎనెర్జీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు నీరసించాయి. ఇదే సమయంలో ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్ లాంటి కీలక స్టాక్స్ కూడా పతనం కావడంతో మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 13.50 పాయింట్లు కోల్పోయి 52,372 వద్ద ముగియగా, నిఫ్టీ 2.80 పాయింట్లు లాభపడి 15,692 వద్ద ముగిసింది.

నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 3.5 శాతం పుంజుకోగా, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్ రంగాలు బలపడ్డాయి. మెటల్, మీడియా, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి, రిలయన్స్ షేర్లు లాభాలను దక్కించుకోగా, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.59 వద్ద ఉంది.

Tags:    

Similar News