మళ్లీ నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా కరోనా భయాలు ఇంకా వీడకపోవడంతో మార్కెట్లు లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడాయి. మంగళవారం లాభాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతోనే మొదలైనప్పటికీ మార్కెట్లు ముగిసే సమయానికి నష్టాలతో క్లోజయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తుండటమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 28 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మదుపర్లలో ఆందోళన పెరగడంతో మార్కెట్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 214.22 పాయింట్ల నష్టంతో 38,409 […]

Update: 2020-03-04 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా కరోనా భయాలు ఇంకా వీడకపోవడంతో మార్కెట్లు లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడాయి. మంగళవారం లాభాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతోనే మొదలైనప్పటికీ మార్కెట్లు ముగిసే సమయానికి నష్టాలతో క్లోజయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తుండటమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 28 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

మదుపర్లలో ఆందోళన పెరగడంతో మార్కెట్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 214.22 పాయింట్ల నష్టంతో 38,409 వద్ద క్లోజయింది. నిఫ్టీ కాస్త నిలకడగా 49.10 పాయింట్లను కోల్పోయి 11,254 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఇండస్ ఇండి బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఐటీసీ షేర్లు అత్యధికంగా 3 శాతానికి పైగా నష్టపోయాయి. సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్, గెయిల్, సిప్లా, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో కొనసాగగా, బజాజ్ ఫినాన్స్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టాలతో క్లోజయ్యాయి.

tags :sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News