కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల నష్టాలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కొనసాగుతుండటం, కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా బుధవారం దేశీయంగా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు బుధవారం కూడా నష్టపోయాయి. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు విక్రయాలను కొనసాగిస్తుండటం స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. దీంతో మార్కెట్లు […]

Update: 2021-12-15 07:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కొనసాగుతుండటం, కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా బుధవారం దేశీయంగా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు బుధవారం కూడా నష్టపోయాయి.

ఇదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు విక్రయాలను కొనసాగిస్తుండటం స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 329.06 పాయింట్ల పతనమై 57,788 వద్ద, నిఫ్టీ 103.50 పాయింట్లు నష్టపోయి 17,221 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ అధికంగా 2 శాతం కుదేలవగా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, మారుతి సుజుకి షేర్లు లాభాలను దక్కించుకోగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ, టీసీఎస్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, డా రెడ్డీస్, షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.29 వద్ద ఉంది.

Tags:    

Similar News