కోలుకుంటున్న మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్ల కరోనా భయం వీడలేదు. సోమవారం రికార్డు స్థాయిలో నష్టాన్ని నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కాసేపటికి లాభాల్లోకి వచ్చాయి. సోమవారం ఆర్‌బీఐ మీడియా సమావేశం ప్రభావంతో సూచీలు కాస్త నిలకడగా కదులుతున్నాయి. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్ 438.31 పాయింట్ల లాభంతో 31,828 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 147.45 పాయింట్లు లాభపడి 9,344 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో దాదాపు అన్ని సూచీలు లాభాల్లో ఉన్నాయి. […]

Update: 2020-03-16 23:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్ల కరోనా భయం వీడలేదు. సోమవారం రికార్డు స్థాయిలో నష్టాన్ని నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కాసేపటికి లాభాల్లోకి వచ్చాయి. సోమవారం ఆర్‌బీఐ మీడియా సమావేశం ప్రభావంతో సూచీలు కాస్త నిలకడగా కదులుతున్నాయి. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్ 438.31 పాయింట్ల లాభంతో 31,828 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 147.45 పాయింట్లు లాభపడి 9,344 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో దాదాపు అన్ని సూచీలు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను నమోదు చేస్తుండగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇన్సిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News