మార్కెట్లను వీడని కరోనా..వెయ్యి పాయింట్ల పతనం!

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లను కరోనా వీడటంలేదు. వరుసగా ఆరోరోజు భారీ నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ మొత్తం 42 దేశాలకు పాకడంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రధానంగా మదుపర్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుగుతందనే ఆందోళన మొదలైంది. 2008లో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం స్థాయిలో వారంపాటు మార్కెట్లు పతనమవడం ఇదే మొదటిసారి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యూకే మార్కెట్లు 3.3 శాతం నష్టపోగా, అమెరికా మార్కెట్ నాస్‌దాక్ […]

Update: 2020-02-27 23:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లను కరోనా వీడటంలేదు. వరుసగా ఆరోరోజు భారీ నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ మొత్తం 42 దేశాలకు పాకడంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రధానంగా మదుపర్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుగుతందనే ఆందోళన మొదలైంది. 2008లో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం స్థాయిలో వారంపాటు మార్కెట్లు పతనమవడం ఇదే మొదటిసారి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యూకే మార్కెట్లు 3.3 శాతం నష్టపోగా, అమెరికా మార్కెట్ నాస్‌దాక్ ఏకంగా 3.7 శాతం నష్టాలను చూసింది. ఇటలీ మార్కెట్లు సైతం భారీగా 6 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

దేశీయ మార్కెట్లు శుక్రవారం ప్రారంభమే వెయ్యి పాయింట్లను కోల్పోయి సూచీలన్నీ దిగజారాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1048.46 పాయింట్ల నష్టంతో 38,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 321.95 పాయింట్లను కోల్పోయి 11,311 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లోని 30 సూచీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా టాటాస్టీల్ 8.82 శాతం నష్టాన్ని చూసింది. మిగిలిన వాటిలో బజాజ్ ఫినాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు భారీగా పతనమయ్యాయి.

Tags:    

Similar News