లాభాల బాటలో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బుధవారం లాభాల్లో కొనసాగినప్పటికీ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగుతాయన్న సంకేతాలతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత లాక్‌డౌన్ పొడిగించడం వల్ల కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య మార్కెట్లు గురువారం సైతం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 830.79పాయింట్ల లాభంతో 30,724 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 268.35 పాయింట్లు లాభపడి […]

Update: 2020-04-08 23:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బుధవారం లాభాల్లో కొనసాగినప్పటికీ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగుతాయన్న సంకేతాలతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత లాక్‌డౌన్ పొడిగించడం వల్ల కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాల మధ్య మార్కెట్లు గురువారం సైతం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 830.79పాయింట్ల లాభంతో 30,724 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 268.35 పాయింట్లు లాభపడి 9,017 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఫార్మా రంగం షేర్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News