భారీ లాభాల్లో మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలు సానుకూల సంకేతాలివ్వడంతో మార్కెట్లు లాభాల బాట పడ్డాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 785.31 పాయింట్ల నష్టంతో 31,475 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 244.50 పాయింట్లు లాభపడి 9,238 వద్ద కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో లాక్‌డౌన్ ఎత్తేస్తారనే సంకేతాలతో అక్కడి మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. అయితే, ఆసియా మార్కెట్ల్పై ఆ ప్రభావం కనబడక మిశ్రకంగా కదులుతున్నాయి. ఇక, డిమాండ్ లేకపోవడం చమురు ఉత్పత్తిని తగ్గించిన నేపథ్యంలో పెరిగిన […]

Update: 2020-04-14 23:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలు సానుకూల సంకేతాలివ్వడంతో మార్కెట్లు లాభాల బాట పడ్డాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 785.31 పాయింట్ల నష్టంతో 31,475 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 244.50 పాయింట్లు లాభపడి 9,238 వద్ద కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో లాక్‌డౌన్ ఎత్తేస్తారనే సంకేతాలతో అక్కడి మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. అయితే, ఆసియా మార్కెట్ల్పై ఆ ప్రభావం కనబడక మిశ్రకంగా కదులుతున్నాయి. ఇక, డిమాండ్ లేకపోవడం చమురు ఉత్పత్తిని తగ్గించిన నేపథ్యంలో పెరిగిన చమురు ధరలు ప్రపంచాన్ని మాంద్యం చుట్టేస్తునందన్న సందేహాలతో మళ్లీ భారీగా పతనమయ్యాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, కొటక్ మహీంద్రా షేర్ మాత్రమే నష్టాల్లో కదులుతోంది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 75.72 వద్ద ఉంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News