నిఫ్టీ 9 వేల మార్కు…కొనసాగుతున్న మార్కెట్ల జోరు!

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 వ్యాప్తితో నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు మంగళవారం రికార్డు స్థాయి లాభాలను సొంతం చేసుకున్నాయి. అయితే, బుధవారం మార్కెట్లు కాస్త కన్ఫ్యూజన్‌కు గురయ్యాయి. ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై మళ్లీ లాభాలకు మారాయి. అమెరికాలో కరోనా మరణాలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనబడుతోంది. ఈ పరిణామాలకు తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికా వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రశ్నించడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక ఉద్దీపన పథకాలు వెల్లడిస్తుండటంతో […]

Update: 2020-04-07 23:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 వ్యాప్తితో నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు మంగళవారం రికార్డు స్థాయి లాభాలను సొంతం చేసుకున్నాయి. అయితే, బుధవారం మార్కెట్లు కాస్త కన్ఫ్యూజన్‌కు గురయ్యాయి. ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై మళ్లీ లాభాలకు మారాయి. అమెరికాలో కరోనా మరణాలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనబడుతోంది. ఈ పరిణామాలకు తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికా వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రశ్నించడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక ఉద్దీపన పథకాలు వెల్లడిస్తుండటంతో ఇన్వెస్టర్లు నిలకడగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 820.53 పాయింట్ల లాభంతో 30,887 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 234.05 పాయింట్లు లాభపడి 9,026 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ నిన్నటి బలం తర్వాత మరో 16 పైసలు బలపడి రూ. 75.48 వద్ద ఉంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ జోరు కొనసాగుతూనే ఉంది. 10 శాతం లాభంతో ట్రేడవుతుండగా, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా అధిక లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీసీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఉదయం నుంచి బ్యాంకింగ్ రంగం షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News