ఐదో రోజూ నష్టాల్లోనే..మార్కెట్లను వీడని కరోనా భయం!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ భయం మార్కెట్లను వీడటంలేదు. చైనాను దాటి ఇతర దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతుండటమే దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లను నష్టాల్లోకి పడేస్తోంది. వరుసగా ఐదో రోజు కూడా మార్కెట్లు నష్టాలతోనే క్లోజయ్యాయి. గత 4 సెషన్లలో సెన్సెక్స్ 1,400 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143.30 పాయింట్ల నష్టంతో 39,745 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 45.20 పాయింట్లను కోల్పోయి 11,633 వద్ద ముగిసింది. […]

Update: 2020-02-27 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ భయం మార్కెట్లను వీడటంలేదు. చైనాను దాటి ఇతర దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతుండటమే దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లను నష్టాల్లోకి పడేస్తోంది. వరుసగా ఐదో రోజు కూడా మార్కెట్లు నష్టాలతోనే క్లోజయ్యాయి. గత 4 సెషన్లలో సెన్సెక్స్ 1,400 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143.30 పాయింట్ల నష్టంతో 39,745 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 45.20 పాయింట్లను కోల్పోయి 11,633 వద్ద ముగిసింది. యూఎస్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నిలకడగా రూ. 71.62 వద్ద ఉంది. సన్‌ఫార్మా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మారుతీ షేర్లు లాభాల్లో క్లోజవ్వగా, ఓఎన్‌జీసీ, మహీంద్రా, అండ్ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి.

ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం గురించి ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అన్నారు. అలాగే, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News