లాభాలతో ముగిసిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లు ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. సోమవారం అనూహ్యంగా చివరి గంటలో నష్టాలను చూడగా, మంగళవారం మార్కెట్లు లాభాలతో క్లోజయ్యాయి. ఎస్‌బీఐ కార్డుల ఐపీవో సానుకూల స్పందన రావడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 479.68 పాయింట్లు లాభపడి 38,623 వద్ద క్లోజయింది. నిఫ్టీ 170.55 పాయింట్ల లాభంతో 11,303 వద్ద ముగిసింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టీసీఎస్ సూచీలు మార్కెట్లు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. మెటల్ షేర్లు అత్యధిక […]

Update: 2020-03-03 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ మార్కెట్లు ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. సోమవారం అనూహ్యంగా చివరి గంటలో నష్టాలను చూడగా, మంగళవారం మార్కెట్లు లాభాలతో క్లోజయ్యాయి. ఎస్‌బీఐ కార్డుల ఐపీవో సానుకూల స్పందన రావడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 479.68 పాయింట్లు లాభపడి 38,623 వద్ద క్లోజయింది. నిఫ్టీ 170.55 పాయింట్ల లాభంతో 11,303 వద్ద ముగిసింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టీసీఎస్ సూచీలు మార్కెట్లు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. మెటల్ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జించాయి. సన్‌ఫార్మా, టాటా స్టీల్ అత్యధికంగా 6 శాతానికి పైగా లాభాల్లో కొనసాగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

Tags:    

Similar News