31 వేలు దాటిన సెన్సెక్స్..మార్కెట్ల జోరు!

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా కొనసాగ్తూన్న నేపథ్యంలో దేసీయ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగుతాయన్న సంకేతాలతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగినప్పటికీ, లాక్‌డౌన్ పొడిగించడం వల్ల కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో కీలక సూచీలు లాభాలతో ట్రేడవ్వడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1265.66 పాయింట్ల లాభాలతో 31,159 వద్ద ముగిసింది. నిఫ్టీ 363.15 […]

Update: 2020-04-09 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా కొనసాగ్తూన్న నేపథ్యంలో దేసీయ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగుతాయన్న సంకేతాలతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగినప్పటికీ, లాక్‌డౌన్ పొడిగించడం వల్ల కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో కీలక సూచీలు లాభాలతో ట్రేడవ్వడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

సెన్సెక్స్ 1265.66 పాయింట్ల లాభాలతో 31,159 వద్ద ముగిసింది. నిఫ్టీ 363.15 పాయింట్లు లాభపడి 9,111 వద్ద క్లోజయింది. విరామం తర్వాత సెన్సెక్స్ 31 వేల మార్కును, నిఫ్టీ 9100 మార్కును దాటింది. అన్ని రంగాల షేర్లు లాభాలను చూడగలిగాయి. ప్రధానంగా ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు మార్కెట్లకు బలంగా మారాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, టైటాన్ అత్యధిక లాభాలతో ట్రేడవ్వగా, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను చూశాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News