అమ్మకాల్లో ఒత్తిడి… స్వల్ప నష్టాల్లో మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో ప్రారంభంలో వచ్చిన లాభాలు చివర్లో నీరసించాయి. ఉదయం ప్రారంభ సమయంలో 250 పాయింట్లకు పైగా లాభపడిన మార్కెట్లు చివరి గంట సమయంలో అమ్మకాల కారణంగా డీలాపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 97.92 పాయింట్లు తగ్గి 38,756 వద్ద ముగియగా, నిఫ్టీ 24.40 పాయింట్లు కోల్పోయి 11,440 వద్ద ముగిసింది. రెండో త్రైమాసికంలో సానుకూల ఫలితాలను […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో ప్రారంభంలో వచ్చిన లాభాలు చివర్లో నీరసించాయి. ఉదయం ప్రారంభ సమయంలో 250 పాయింట్లకు పైగా లాభపడిన మార్కెట్లు చివరి గంట సమయంలో అమ్మకాల కారణంగా డీలాపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 97.92 పాయింట్లు తగ్గి 38,756 వద్ద ముగియగా, నిఫ్టీ 24.40 పాయింట్లు కోల్పోయి 11,440 వద్ద ముగిసింది. రెండో త్రైమాసికంలో సానుకూల ఫలితాలను సాధించే అవకాశాలున్నాయనే ప్రకటనతో హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 11 శాతం ర్యాలీ చేశాయి.
నిఫ్టీలో ముఖ్యంగా ఐటీ రంగం షేర్లు అత్యధికంగా 4.5 శాతం ర్యాలీ చేయగా, రియల్టీ సైతం అత్యధికంగా ట్రెండైంది. ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్తాన్ యూనిలీవర్, ఎల్అండ్‌టీ, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో నమోదయ్యాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.48 వద్ద ఉంది.
Read Also..