రెండోరోజూ నష్టాల్లోనే మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడిదారుల లాభాల స్వీకరణతో మార్కెట్లకు పతనం తప్పలేదు. సోమవారం భారీ నష్టాల తర్వాత మంగళవారం కూడా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం పుంజుకున్నట్టే కనబడినప్పటికీ మధ్యాహ్నం తర్వాత చతికిలబడ్డాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 261.84 పాయింట్లు నష్టపోయి 31,453 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 87.90 పాయింట్లు కోల్పోయి 9,205 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, రిలయన్స్ షేర్లు లాభాల బాటపట్టగా, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ […]

Update: 2020-05-05 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడిదారుల లాభాల స్వీకరణతో మార్కెట్లకు పతనం తప్పలేదు. సోమవారం భారీ నష్టాల తర్వాత మంగళవారం కూడా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం పుంజుకున్నట్టే కనబడినప్పటికీ మధ్యాహ్నం తర్వాత చతికిలబడ్డాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 261.84 పాయింట్లు నష్టపోయి 31,453 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 87.90 పాయింట్లు కోల్పోయి 9,205 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, రిలయన్స్ షేర్లు లాభాల బాటపట్టగా, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లకు నష్టాలు తప్పలేదు. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.62 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఏర్పడటంతో మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఎగిశాయి. లంచ్ సమయానికి నెమ్మదిగా బలహీనపడి నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి గంతలో సుమారు 810 పాయింట్ల వరకూ నష్టపోయాక అనంతరం కోలుకుని 261 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News